డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్ పెట్టిన కండిషన్ ఇదే!

Must read

  • డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..
  • డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా ఓటు
  • తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు..
  • దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోం

BRS Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, బిల్లుకు మద్దతు ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు..

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండొద్దు :
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న వేళ కేటీఆర్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకూడదన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష పడినట్టుగా పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు..

పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం అలాగే కొనసాగాలని కేటీఆర్ కోరారు. కేంద్రం ప్రతిపాదించిన తాజా సవరణల ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు 2051 వరకు ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే అంశం తమ ఆందోళనకు పరిష్కారంగా ఉందని వివరించారు..

బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడదు :
ఇదే జరిగితే.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడదని, డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణకు అన్యాయం జరిగితే గట్టిగా నిలబడతామని హెచ్చరించారు..

మరోవైపు మహిళా రిజర్వేషన్లపైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్న వేళ డీఎంకే కూడా తాజా ప్రతిపాదనల నేపథ్యంలో మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ మద్దతు వెనుక తెలంగాణ, దక్షిణాది ప్రయోజనాలే ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article