విశ్వక్ సేన్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్‌!

Must read

Vishwak sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న‌టిస్తున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. ఏక్తా రాథోడ్ క‌థానాయిక‌. గోవింద్ వ‌సంత సంగీతాన్ని అందిస్తున్నారు. రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూరైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు. అయితే.. కొన్ని సీన్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండ‌డం వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. ఇప్పుడు షూటింగ్ పూర్తి అయింది.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన అంశాల చుట్టూ సాగుతుంది. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. రాజకీయాల ప్రభావం వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి పరిణామాలను చూపిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article