సీఎం విదేశీ ఉపాధి పథకం.. రూ.1.75 లక్షల వరకు సాయం.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలో తెలుసా?

Must read

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాల అవకాశం
  • విదేశీ కొలువు సాధిస్తే చాలు..
  • రూ.50 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు సాయం

Telangana Foreign Jobs : విదేశాల్లో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంటున్నారా? అయితే, తెలంగాణ యువతకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

విదేశాల్లో ఉద్యోగాలు పొందే నిరుద్యోగులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం విదేశీ ఉపాధి పథకం’ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7 వేల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది..

ఎవరెవరికి ఎంత సాయం? :
ఈ పథకంలో 2 విభాగాలుగా ఆర్థిక సాయం అందిస్తారు.

నేరుగా విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారు :
వీసా, విమాన ప్రయాణ ఖర్చుల కోసం గరిష్ఠంగా రూ.50 వేల వరకు సాయం అందుతుంది.

విదేశీ భాషా ప్రావీణ్యంతో ఉద్యోగాలు :
భాషా శిక్షణ, ఇతర అవసరమైన ఖర్చులను కలిపి గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. మొత్తం ఖర్చులో ప్రభుత్వ వాటా 50 శాతం ఉంటుంది. మిగతా 50 శాతం అభ్యర్థి భరించాల్సి ఉంటుంది. ఆ మొత్తం సమకూర్చుకోలేని వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు..

ఈ పథకానికి ఎవరు అర్హులు? :
అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది.

  • అభ్యర్థి తెలంగాణ స్థానికుడై ఉండాలి.
  • వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
  • 6 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివి ఉండాలి.
  • దరఖాస్తు సమయంలో కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్టు ఉండాలి.
    ఉద్యోగ సంస్థ నిర్వహించిన వైద్య పరీక్షలు పూర్తి చేసి ఉండాలి.
    ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

ఈ పథకానికి ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హత సర్టిఫికెట్లు, వృత్తి నైపుణ్య వెరిఫికేషన్ డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి.

దరఖాస్తులను తొలుత జిల్లా ఉపాధి కల్పన అధికారులు పరిశీలిస్తారు. అర్హుల జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి పంపిస్తారు. అక్కడ ఫైనల్ ఆప్షన్ జరుగుతుంది. దరఖాస్తు గడువు ముగిసిన 30 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిబంధనలు చెబుతున్నాయి..

డబ్బులు ఎప్పుడు వస్తాయి? :
ఎంపికైన అభ్యర్థులకు అర్హమైన ఆర్థిక సాయంలో మొదట 50 శాతం చెల్లిస్తారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగంలో చేరిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు సమర్పిస్తే మిగిలిన 50 శాతం కూడా ఖాతాలో జమ చేస్తారు.

విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ యువతకు ఈ పథకం ఆర్థికంగా భారీ ఊరటనివ్వనుంది. అయితే, అప్లయ్ చేసే ముందు అర్హతలు, పత్రాలు, అధికారిక మార్గదర్శకాలను చెక్ చేసుకోండి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article