వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి 184, 185, 189 బూత్‌లను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటరు నమోదు ఫార్మ్ విత్తరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ఓటర్లతో మాట్లాడిన ఆమె, ఓటరు నమోదు దరఖాస్తులు సక్రమంగా ఎలా నింపాలి, అవసరమైన వివరాలు ఏవిధంగా నమోదు చేయాలి అనే అంశాలను వారికి వివరించారు.అలాగే బూత్‌లలో కొనసాగుతున్న పనులను పరిశీలించి, ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు.






