Thursday, July 9, 2026

జేకే కాలనీలో ప్రజల సమస్యలు తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Must read

వినాయక్ నగర్ డివిజన్ జేకే కాలనీలో మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్ కారణంగా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచాలని, వంగిపోయిన విద్యుత్ స్తంభాన్ని వెంటనే సరిచేయాలని స్థానికులు కోరారు. నీటి సరఫరాలో తక్కువ ప్రెషర్, పారిశుద్ధ్య సిబ్బంది రాకపోవడం, దోమల నివారణ స్ప్రేయింగ్ జరగకపోవడం వంటి సమస్యలను ప్రజలు వివరించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను స్వయంగా నమోదు చేసుకున్న రాజ్యలక్ష్మి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులను ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తానని, పెన్షన్ల విషయమై మున్సిపల్ అధికారులతో మాట్లాడి అర్హులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!