Friday, June 26, 2026

నీట్-యూజీ 2026 రద్దుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Must read

(నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు పరిస్థితి రావడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఇది దేశానికి సిగ్గుచేటు పరిణామమని వ్యాఖ్యానించారు. కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృథా కావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందే లీక్ అయ్యాయని ఆరోపిస్తూ, ఇది వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2024లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తూ, పునరావృతమవుతున్న లోపాలపై కేంద్రం బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఎన్డీయే ప్రభుత్వ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. పరీక్ష వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు వస్తున్నాయని అన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్​ కూడా తీవ్రంగా స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. పరీక్ష వ్యవస్థలో మోసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

స్టాలిన్ నీట్ పరీక్ష విధానంపైనే ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో నీట్ వ్యవస్థను రద్దు చేయాలని లేదా పాత విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్లస్ టూ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించే పాత విధానం తిరిగి తీసుకురావాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ వ్యవస్థపై చర్చ కొనసాగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నీట్-యూజీ 2026 రద్దు వ్యవహారం విద్యా రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై అందరి దృష్టి నిలిచింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!