Friday, June 26, 2026

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

Must read

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ఎం కోదండరామ్​, మహ్మద్​ అజారుద్దీన్​ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ శాసన మండలిలో ఘనంగా జరిగింది.

మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్​ రెడ్డి ఈ ఇద్దరు నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రెవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ నాయకులు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శివాప్రసాద్​ శుక్ల ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర మంత్రివర్గం, పీసీసీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి సవాలు ఒక కొత్త అవకాశంగా భావించి ముందుకు సాగాలని యువతకు సూచించారు.

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ వాదనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన నియామకం పూర్తిగా పార్టీ నిర్ణయంతో, తన సేవలను గుర్తించి తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు.

కోదండరామ్ కూడా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!