Friday, June 26, 2026

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

Must read

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన అభిమాన సూచకంగా ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ ఆర్ట్ గిఫ్ట్‌ను అందజేశారు. ఆ బహుమతిని స్వీకరించిన రామచందర్ రావు ఆనందం వ్యక్తం చేస్తూ రాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, రామచందర్ రావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడుతోందని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన కృషి ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కలిగి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!