Saturday, June 6, 2026
Google search engine

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

Must read

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన అమరావతి బిల్లుపై గౌరవ రాష్ట్రపతి సంతకం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో గత ఐదేళ్లుగా సాగిన అనిశ్చితికి తెరపడి, నవ్యాంధ్ర నిర్మాణానికి మార్గం సుగమమైందనీ . ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు.

విజయవాడ గురునానక్ కాలనీలోని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడారు. నేటి అమరావతి శాశ్వత రాజధాని
రైతుల త్యాగం..అన్నారు.
అమరావతి నిలబడిందంటే అది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, వేలాది మంది రాజధాని రైతులు ,మహిళల రక్తం, కన్నీరు, త్యాగ ఫలితమని కొనియాడారు . గత ప్రభుత్వ వైసిపి పాలనలో అమరావతి రాజధాని ప్రాంత ప్రజలను, రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని, ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడిన ప్రతి ఒక్కరి త్యాగమే నేటి రాజధాని అమరావతి ప్రాంతం అన్నారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పైసా తీసుకోకుండా 34 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు రాజధాని కోసం ఇచ్చారన్నారు. ఆనాటి రైతుల త్యాగం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం అన్నారు.

2019- 24 మధ్య ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలు, రైతులు ఎన్నో హింసలు, చిత్రహింసలు అనుభవించినా, వెనకడుగు వేయకుండా పోరాడి విజయం సాధించారని తెలిపారు.

అమరావతి అంటే కేవలం నాలుగు భవనాలు కాదని, అది రాష్ట్రాన్ని నడిపించే ఒక శక్తి అన్నారు. సమర్థవంతమైన శక్తియుత రాజధానిని నిర్మాణం చేయగలరని నమ్మకంతోనే ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ను మొదటి నుంచీ నమ్మారన్నారు . ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, అంతకు మించి అమరావతిని తీర్చిదిద్దుతారని దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో చాటి చెప్తూ… లోక్‌సభలో అమరావతి శాశ్వత రాజధాని చట్టబద్ధత బిల్లు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు సైతం చంద్రబాబు సామర్థ్యాన్ని వేనోళ్ల పొగిడాయన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనమని తెలిపారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందితే రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటికీ కూడా అమరావతి పై నిప్పులు కక్కుతూనే ఉన్నారన్నారు.
అమరావతికి దేశమంతా మద్దతు తెలుపుతుంటే, సొంత రాష్ట్రానికి చెందిన వైసీపీ మాత్రం పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం వారి హీన చరిత్రకు నిదర్శనమని విమర్శించారు. జగన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ‘మూడు రాజధానుల’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, అందుకే ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చి ‘లెవన్ రెడ్డి’గా మార్చారని ఎద్దేవా చేశారు . అమరావతి పేరును అపహాస్యం చేసేలా మావిగన్ అంటూ కొత్త కొత్త వింత పేర్లతో జగన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించడమే కాకుండా రాజధాని అంశాన్ని ఓ కామెడీ పీస్ గా జగన్ మార్చాడు అన్నారు. మావిగన్ అంటూ కొత్త కొత్త పేర్లు తీసుకువచ్చి రాజధాని ప్రతిష్ట దిగజార్చేలా జగన్ మాట్లాడుతున్న తీరు వైసిపి పార్టీ నాయకులే అసహ్యించుకునేలా ఉందన్నారు. మావిగన్ లో అసలు అమరావతి పేరు ఎక్కడ ఉందో జగన్ చెప్పాలన్నారు. సి ఆర్ డి ఏ పరిధిలు కూడా తెలియని జగన్ రాజకీయాల్లో పనికిరాడు అన్నారు.

రాజధాని నోటిఫికేషన్‌తో పాటు విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది మార్చిలో సెన్సస్ పూర్తి కాగానే గ్రేటర్ విజయవాడ ఏర్పాటు జరుగుతుందన్నారు.

విజయవాడ నగర అభివృద్ధి పరంగా ఆటోనగర్ రోడ్లు, మున్సిపల్ స్టేడియం ఆధునికీకరణ, మరియు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయని ఎంపీ చిన్ని తెలిపారు.

విజయవాడ ప్రాంతమే కాకుండా విశాఖలో ఐటీ హబ్, చిత్తూరులో ఆటోమొబైల్, అనంతపురంలో డిఫెన్స్ క్లస్టర్, కర్నూలులో సోలార్ పార్కులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుందని స్పష్టం చేశారు .

అమరావతికి పడిన రాజముద్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసాగా నిలిచిందన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కృషితో రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తామని , రానున్న 30 సంవత్సరాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుందన్నారు. అమరావతి రాజధాని ని అడ్డుకోవడం జగన్ తరం కాదన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రస్తుతం 11 రెడ్డి గా ఉన్న జగన్ రెడ్డి జీరో రెడ్డి కావడం ఖాయం అన్నారు.

పత్రికా సంస్థలపై వైసీపీ నాయకులు దాడులకు దిగటం సరికాదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థపై వైసీపీ శ్రేణులు దాడి చేయటాన్ని ఎంపీ తీవ్రంగా ఖండించారు.

కేక్ కట్ చేసి సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించి గెజిట్ విడుదలైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో సంబరాలు నిర్వహించారు. ముందుగా ఎంపీ చిన్ని, టిడిపి నాయకులు టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేకు కోసి జై అమరావతి అంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరై ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సైతం హర్షం వ్యక్తం చేయగా, టిడిపి నాయకులు బొప్పన భవకుమార్, షేక్ ఆశ, సొంగ సంజయ్ వర్మ, ఎస్.కె కరీముల్లా, కాకు మల్లికార్జున యాదవ్, చరణ్ సాయి యాదవ్, పొట్లూరి దర్శిత్, మాదిగాని గురునాదం, ఎర్నేని వేదవ్యాస్, నరసింహ చౌదరి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!