Friday, June 26, 2026

ఘనంగా బీజేపీ 47వ స్థాపన దినోత్సవ వేడుకలు

Must read

భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి జై”, “వందే మాతరం” వంటి నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. అనంతరం స్వీట్లు పంచుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయగాథను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!