Friday, June 26, 2026

ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీపై కవిత ఫైర్..

Must read

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపుపై తీవ్ర విమర్శలు గుప్పించారు కల్వకుంట్ల కవిత. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులను 25 నుంచి 30 శాతం వరకు పెంచి, తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని ఆరోపించారు.రాష్ట్రంలో మొత్తం 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో చాలా చోట్ల నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇది విద్యను వ్యాపారంగా మార్చే ప్రమాదకర ధోరణి అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆమె విమర్శలు చేశారు. గతంలో ఫీజు నియంత్రణ చట్టం అవసరంపై మాట్లాడిన ఆయన, ఇప్పుడు అసెంబ్లీలో ఆ అంశాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే తల్లిదండ్రులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

పాఠశాల యాజమాన్యాలపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీజులు పెంచుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల జీతాలను పెంచడం లేదని విమర్శించారు. విద్యా రంగంలో నాణ్యత కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రైవేట్ పాఠశాలల ముందు ఆందోళనలు చేపడతామని కవిత హెచ్చరించారు. తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా, విద్యా సంస్థల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. స్థానికులకు అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఇంకా, రాష్ట్ర పాలనపై కూడా కవిత విమర్శలు చేశారు. అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా వ్యవహరించడం రాష్ట్ర దౌర్భాగ్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది పరిపాలనలో అసమర్థతకు సంకేతమని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!