Friday, June 26, 2026

ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే: సీఎం రేవంత్

Must read

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది తన వద్దకు వచ్చి “మేము కేవీపీలా ఉంటాం” అంటున్నారని, అయితే వారు ఎప్పటికీ కేవీపీలు కాలేరని వ్యాఖ్యానించారు. కేవీపీలా కావాలంటే సర్వం త్యాగం చేసే గుణం అవసరమని రేవంత్ చెప్పారు. అలాంటి త్యాగ గుణం ఈ తరంలో ఎవరిలోనూ కనిపించడం లేదని ఆయన అన్నారు. కొందరు లోపలికి వచ్చిన వారం లోపే కుర్చీ కోసం ఆశపడుతున్నారని, రెండో వారానికి “నేనే పార్టీని నడుపుతా” అని చెప్పే స్థితికి చేరుతున్నారని విమర్శించారు. తాను చెప్పింది తన అనుభవంతోనేనని సీఎం రేవంత్ వివరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!