Friday, June 26, 2026

కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా : మంత్రి సీతక్క

Must read

కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, “కేసీఆర్ కుటుంబ సమస్యలు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చాయి. స్వయంగా కుటుంబ విభేదాలను సర్దుబాటు చేసుకోలేని స్థితికి కేసీఆర్ చేరుకున్నారు” అని అన్నారు.కవిత ఆరోపణలపై స్పందిస్తూ సీతక్క, “కాలేశ్వరం అవినీతి బయటపడటంతోనే కేసీఆర్ కుటుంబం గొడవలు మొదలయ్యాయి. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే విభేదాలు ఉత్పన్నమయ్యాయి. సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు సంపాదించాడని కవిత బహిరంగంగా చెప్పింది. అదే వ్యక్తి ములుగులో నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టాడు” అని పేర్కొన్నారు.కవిత సస్పెన్షన్ వెనుక కేటీఆర్ ప్రమేయం ఉన్నదని సీతక్క వ్యాఖ్యానించారు. “కవితను సస్పెండ్ చేసి సంబరాలు చేసుకోవడం, మహిళా నాయకుల ద్వారా ఆమెను విమర్శింపజేయడం సరికాదు. గతంలో మమ్మల్ని విమర్శించిన మహిళా నాయకులను, ఇప్పుడు కవితపై నిలబెడుతున్నారు” అని అన్నారు.

“కేసీఆర్ కుటుంబం మొత్తంగా ఒకటే. తాత్కాలికంగా విభేదాలు ఉన్నా, భవిష్యత్తులో అందరూ తిరిగి కలిసిపోతారు. అయితే కవితపై బహిరంగంగా విమర్శించిన మహిళా నాయకురాలు మాత్రం చివరికి నష్టపోతారు” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!