Friday, June 26, 2026

రజనీకాంత్ ‘కూలీ’ సెప్టెంబర్ 11న ఓటీటీలోకి

Must read

సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకంగా ఆగస్ట్ 14న విడుదలైన ‘కూలీ’ భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ స్థాయిలో మాస్ బజ్ క్రియేట్ చేసినా, థియేటర్లలో మాత్రం అదే మిరాకిల్ కొనసాగలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నప్పటికీ రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. కథలో లాజిక్ లోపాలు, రజినీ హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ కావడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించాయి. లోకేష్ కనగారాజ్ యూనివర్స్‌లో మునుపటి చిత్రాలు కల్ట్‌గా నిలిచినా, ‘కూలీ’ మాత్రం మిశ్రమ స్పందననే తెచ్చుకుంది.అయితే, థియేటర్లలో ఇప్పటికీ బలమైన రన్ కొనసాగిస్తూ రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. రిలీజ్‌కు ముందే అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 11 నుంచి పాన్ ఇండియా భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేట్రికల్ రిలీజ్‌కు కచ్చితంగా 28 రోజులకు డిజిటల్ ప్రీమియర్ జరగనుంది.
థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ‘కూలీ’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబడుతుందో ఆసక్తిగా మారింది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!