Friday, June 26, 2026

పంచాయతీరాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

Must read

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీలు)కు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, వారి జనాభా ప్రాతిపదికన తగిన వాటా లభించడం లేదని గుర్తించిన ప్రభుత్వం శాస్త్రీయ సర్వేలు నిర్వహించింది.జి.ఓ.ఎంఎస్ నెం.18 (10-10-2024) ప్రకారం రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఆధారిత సమగ్ర ఇంటింటి సర్వే జరిగింది. ఆ వివరాలను పరిశీలించిన డెడికేటెడ్ కమిషన్, బీసీలు వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ క్రమంలో, రిజర్వేషన్ల పెంపుకు అవరోధంగా ఉన్న 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని నిబంధన ఉండేది. ఆ పరిమితిని తొలగిస్తూ, వాస్తవ స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు నిర్ణయించేలా కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది.ఆగస్టు 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈరోజు (ఆగస్టు 31, 2025) “తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2025” ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది.ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి, వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని సభను కోరింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!