Friday, June 26, 2026

చిల్కానగర్‌లో ₹59 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Must read

చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు మరియు బస్తీల్లో ₹59 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చిల్కానగర్ డివిజన్‌లో దాదాపు ₹95 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంకా పలు కీలక పనులు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన దశలవారీగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, GHMC డివిజన్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల శివరేజ్ లైన్ల ఏర్పాటు అవసరం ఉన్నందున కొన్ని సీసీ రోడ్ల పనులు జాప్యం అవుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు చిల్కానగర్ డివిజన్‌కు పెద్ద ఎత్తున నిధుల్ని మంజూరు చేస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రజల తరఫున, తన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!