Saturday, June 6, 2026
Google search engine

జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలను నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం

Must read

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ టెరిటోరియల్‌ కంస్టిట్యూన్సీలు (జెడ్పిటిసీలు), మండల పరిషత్‌ టెరిటోరియల్‌ కంస్టిట్యూన్సీలు (ఎంపీటిసీలు) సంఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా, మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5773గా ప్రభుత్వం ఖరారుచేసింది.

ఈ నిర్ణయం వచ్చే రోజుల్లో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎంతో కీలకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కలు, ఇతర పరిపాలనా అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!