సాంకేతిక కార్యవర్గం:
నటీనటులు: శివకార్తీకేయన్, మారియా రబోష్క, సత్యరాజ్, ప్రేమ్ గీ అమరేన్, తదితరులు
డైరెక్టర్: అనుదీప్ కెవి
నిర్మాత: సునీల్ నారాగ్, సురేశ్ బాబు, డి. పుష్కర్ రామ్ మోహన్ రావు,
మ్యూజిక్: థమన్,
సినిమా టోగ్రఫీ : మనోజ్ పరమహంస 

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది శివకార్తీకేయన్ కు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో శివకార్తీకేయన్ ‘ప్రిన్స్’ మూవీతో శుక్రవారం థియేటర్లోకి వచ్చాడు. ఈ మూవీ ట్రైలర్ తో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దీపావళి కానుకగా రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు థియేటర్ బాట పడుతున్నారు. ఇప్పటి వరకు రెమో తదితర సినిమాలతో ఆకట్టుకున్న శివకార్తీకేయన్ తాజా మూవీ ‘ప్రిన్స్’లో ఎలా అలరించాడో చూద్దాం. 

కథ:
అన్బు( శివకార్తికేయన్) ఒక తప్పు చేస్తాడు. ఈ కారణంగా అతడిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అతని తండ్రి ఉలగనాథన్ (సత్యరాజ్) కూడా గ్రామస్థులతో కలిసి కొడుకును దూరంగా ఉంచుతాడు. ఇదే సమయంలో కథ ప్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇందులో
అన్బు స్కూల్ టీచర్ గా కనిపిస్తాడు. తనతో కలిసి పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ మారియా రబోషప్క ను లవ్ చేస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి అనేక కష్టాలు పడుతుంటాడు. ఈ తరుణంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆమె విదేశీ వనిత. ఉలగనాథ్ తండ్రి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో మరణిస్తాడు. దీంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అనేక చిక్కులు ఎదురవుతాయి. అయితే అన్బు తండ్రిని ఎలా ఒప్పిస్తాడు..? అందుకు ఏం చేస్తాడు..? 

– ఎవరెలా నటించారంటే.:
శివకార్తీకేయన్ కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. ఒక దశలో ఆయన నటన ఆకట్టుకుంది. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులను అనుగుణంగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ నటన కూడా తన పాత్రలో ఇమిడిపోయాడు. ఆయన చేసిన కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. ప్రేమ్ గీ అమరెన్ భూ కబ్జా మాఫీయా అధినేత పాత్రలో మెప్పించాడు. 

-విశ్లేషణ:
ప్రిన్స్ పూర్తిగా కామెడీ చిత్రం. అక్కడక్కడా యాక్షన్ సీన్స్ ఉన్నా.. ఓవరాల్ గా మాత్రం నవ్వులు పూయించింది. అయితే కొన్ని జోకులు పేలలేదనే చెప్పాలి. ఫస్టాఫ్ కాస్త బోర్ గానే సాగుతుంది. సెకండాఫ్ లో కథ సీరియస్ గా మూవ్ అవుతుంది. ఆనంద్ రాజ్ పోలీస్ స్టేషన్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ చమత్కారమైన తండ్రిగా కనిపించి మరుపురాని సన్నివేశాలను అందించాడు. దర్శకుడు అనుదీప్ ప్రేక్షకులకు మంచి చిత్రాన్నే అందించాడని చెప్పాలి. తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కెమెరా, ఎడిటింగ్ పనితీరును మెచ్చుకోవచ్చు.