కరోనా నుంచి కోలుకున్న కట్టప్ప
సినీ నటుడు సత్యరాజ్ కరోనా నుంచి కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన… చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని… ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని తెలిపారు.
Share this article in your network!