రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అపశృతి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా పాదయాత్రకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. మరోవైపు, ఈనాటి పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శివకుమార్ కాలిపై నుంచి రాహుల్ కాన్వాయ్ లోని వాహనం వెళ్లింది. దీంతో, ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Share this article in your network!