పూనకాలు లోడింగ్ …
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రవితేజ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య . 2023 జనవరి 13 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదల అయిన పాటలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పూనకాలు లోడింగ్ అనే పాట విడుదలై యూట్యూబ్ లో ఒక సంచలనంగా మారింది.
చిరంజీవి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా పండగ లాంటిది అన్నట్టుగానే ఈ పాట చిత్రీకరణ మరియు అందులో చిరంజీవి, రవితేజ కలిసి వేసిన స్టెప్స్ చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఈ పాటలోని హైలైట్స్ ఏంటంటే ఈ పాటకు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ తమ గొంతును కలపడం. ముఖ్యంగా చిరంజీవి వేసిన స్టెప్స్ చూస్తుంటే ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంది. కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చాలా అద్భుతంగా ఈ పాటకు స్టెప్స్ అందించినట్టు అర్ధమవుతుంది.
ఇప్పటికే ప్రేక్షకులకు ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, ఈ పాటతో ఇంకా హైప్ పెరిగిపోయింది. ఇద్దరు సూపర్ స్టార్ లు దాదాపు 22 సంవత్సరాల తరువాత ఒకే సినిమాలో కలిసి నటించడంతో చాలా మంది ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
Share this article in your network!