మహిళా సాధికారతే లక్ష్యం- ఎమ్మెల్యే ఆళ్ల నాని
మహిళ సాధికారతతోనే సుస్థిర ప్రగతి సాధ్యమని, అందుకు అనుగుణంగా మహిళల స్వయం సమృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. 108వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక 28వ డివిజన్ బీడీ కాలనీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం వైయస్సార్ చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసి నేస్తం, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించడంతో పాటు బ్యాంకు రుణాలు మంజూరు చేయించి జీవనోపాధిని కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన తేదీ నాటికి ప్రజలకు సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా పదవులను మహిళలకు కేటాయించామని తెలిపారు. మహిళల భద్రత కోసం దిశా ఆప్, దిశా చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కొల్లిపాక సురేష్, కొలికి పాముల తిరుపతి రావు, లచ్చిరెడ్డి గోవిందరావు, పలువురు కార్పొరేటర్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కమిటీల చైర్మన్లు, తదితరు
Share this article in your network!