రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని భావించింది. అయితే, నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు నేడు తెలిపింది. ఏపీలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దాంతో, ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూపై ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సవరణ చేసింది. 

దీనిపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.