నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మధ్యల విబేధాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇద్దరి మధ్య అంతర్గత విబేధాలు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ ప్రోగ్రాం లోనూ చురుగ్గా పాల్గొనేవారు. కాని కొన్ని నెలలుగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మునుపటి స్పీడ్ ను తగ్గించడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. 

వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉన్నారనే వార్తలు అటు టీడీపీలోనూ, వైసీపీలోనూ కాకపుట్టిస్తున్నాయి. నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ అయ్యారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటానని లోకేష్‌తో సిద్దార్థరెడ్డి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లా పాలిటిక్స్‌ ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ మధ్య మిడుతూరు మండలం నాగాలూటిలో ఎమ్మెల్యే ఆర్థర్ లేకుండానే ఇంచార్జ్ మంత్రితో కలిసి ప్రరంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై ఆర్థర్ అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ ఎపిసోడ్ తోనే బైరెడ్డి స్పీడ్ తగ్గించారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 

ఇది మనస్సులో పెట్టుకునే పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ అంటీముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. చంద్రబాబు, లోకేష్ లతో టచ్ లోకి వెళ్ళిన తరువాతే బైరెడ్డి తన మునుపటి దూకుడును తగ్గించారనే విషయాన్నీ బైరెడ్డి టీం కొట్టిపారేస్తోంది. సిద్దార్థ్ రెడ్డికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి ప్రధాన్యత జగన్ కల్పించారని …అలాంటప్పుడు బైరెడ్డి వైసీపీని ఎందుకు వీడుతారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ , సిద్దార్థ్ రెడ్డి టీడీపీలో చేరితే అక్కడ కూడా వికెట్లు పడే అవకాశం లేకపోలేదు. బైరెడ్డి సిద్దార్థరెడ్డి టీడీపీలో చేరితే…నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఇంచార్జ్‌గా గౌరు వెంకటరెడ్డి టీడీపీని వీడే అవకాశం ఉందట. మొత్తానికి , సిద్దార్ధరెడ్డి ఎపిసోడ్‌ ఇరు పార్టీలోనూ కాక రేపుతోంది.