మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనన్ను గెలిపించి ఈ స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాననని చెప్పుకొచ్చారు.
Share this article in your network!