చాలా మంది పుట్టి చనిపోతుంటారు,కానీ కొంతమంది మాత్రమే ప్రజలగుండెల్లో ఎప్పటికీ ఉండిపోతారు. అటువంటి అరుదైన వారిలో శ్రీమత్ అద్దంకి తిరుమల శ్రీశైలనాథన్ అయ్యంగార్(పెద్దయ్యగారు) ఒకరు. దాదాపు 30 గ్రామాల ప్రజలు ఆయనను ఒక దేవుడిలా కొలిచేవారు,ఆయన ఉన్న సమయంలో ఆయన ఇల్లు శిష్యులతో కిటకిటలాడుతూ ఉండేది. కేవలం సామాన్య ప్రజలే కాకుండా అనేకమంది రాజకీయ ప్రముఖులు,సినీ పరిశ్రమకి వస్తే దగ్గుపాటి రామానాయుడు,దాసరి నారాయణరావు వంటి వారు సైతం ఆయనను కలవడానికి వచ్చేవారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడుడల్లా పెద్దయ్యగారిని కలుస్తుండేవారు. 

అయితే ఎంతటివారైనా విధిరాతకు తలొగ్గాల్సిందే. సరిగ్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ 28,2021 వ తేదీన కరోనా కారణంగా ఆయన మనందరినీ వదిలి వైకుంఠానికి చేరుకున్నారు. ఆయన మనలను వదిలి వెళ్లి సంవత్సరం అయిన సందర్భంగా వారి శిష్యబృందం అత్యంత వైభవంగా సంస్మరణ సభను పెద్దయ్యగారి స్వగ్రామమైన తూర్పుతక్కెళ్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28,2022 సాయంత్రం 5 గంటల నుండి ఈ కార్యక్రమం మొదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రకు సంబందించిన పుస్తకం కూడా ఆవిష్కరించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పెద్దయ్యగారి శిష్యబృందం అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం BABAI MEDIA యూట్యూబ్ ఛానెల్ ద్వారా రేపు సాయంత్రం 5 గంటలనుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.