త్వరలో లోకేశ్ పాదయాత్ర చేసే అవకాశం
మహానాడు సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ జోష్ లో కనిపిస్తోంది. ఇక నుండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు.
త్వరలో లోకేష్ పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ 2 నుండి పాదయాత్ర మొదలు పెట్టునున్నట్లు సమాచారం. రాష్ట్రం అంతా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఏడాది పాటు ప్రజల్లో ఉండేలా లోకేష్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు లోకేష్. మంగళగిరిలో ఇంటింటినీ టచ్ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో మంగళగిరిలో యాత్ర పూర్తి కానుంది. ఆ వెంటనే పాదయాత్రకు సిద్దమయ్యే అవకాశం ఉంది. గతంలో అక్టోబర్ 2 నుండి చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టారు. అదే సెంటిమెంట్‌తో ఉన్నారు లోకేష్. చంద్రబాబులానే యాత్ర పూర్తయ్యేదాకా ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే అక్టోబర్ కన్నా ముందే పాదయాత్ర మొదలెట్టే అవకాశం ఉంది.
Share this article in your network!