మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీలో ఉన్న శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి హాజరైన ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మౌలాలిలో శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి దేవస్థాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్




