మాతృభూమి సేవలో నిత్యం అంకితభావంతో పనిచేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, నిరంతర శక్తి ప్రసాదించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆనంద్‌బాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ 4,398 రోజుల పదవీకాల రికార్డును అధిగమించి, భారతదేశంలో అత్యధిక కాలం సేవలందిస్తున్న ప్రధానమంత్రిగా అరుదైన ఘనత సాధించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో 12 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణం భారతదేశ అభివృద్ధికి, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల సాధనకు, ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు.ఈ సందర్భంగా మల్కాజిగిరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రజాసేవ మరింత విజయవంతంగా కొనసాగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. మోదీ నాయకత్వం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ పట్ల ఆకర్షితులై వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీదేవి, భారతి, మాధవి, పద్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎన్. రాంచందర్ రావు ని మల్కాజిగిరి బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, ఆర్‌కే శ్రీనివాస్, గోపు రమణ రెడ్డి, భాను ప్రకాష్, రామకృష్ణ, ప్రసన్న, శ్రీనివాస్ ముదిరాజ్, నరసింహ చారి, వాసంశెట్టి శ్రీనివాస్, బక్క నాగరాజు, ప్రభు గుప్తా, బాలచందర్ గౌడ్, కృష్ణ గౌడ్, భరత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.





