విజయవాడ ఉత్సవ్ వేదికలపై జరుగుతున్న కార్యక్రమాలను భక్తులతోపాటు నగరవాసులు ఆహ్వానిస్తున్నారని, సాయంత్రం 6 గంటల తర్వాత నగర వాసులు ఉత్సవ్ లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారన్నారు. రేపు రాష్ట్రపతి సీకే రాధకృష్ణన్ రానున్న నేపధ్యంలో మంగళవారం పున్నమి ఘాట్ లో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ కేశినేని శివనాథ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ –విజయవాడ ఉత్సవ్ విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ఉత్సవం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగిందని, ఈ ఉత్సవాలకు పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. 28న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, 29న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారని తెలిపారు. .
అనంతరం స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సందర్భంగా నగర ప్రముఖులందరూ ఒక సొసైటీగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు విజయవాడకు మరింత శోభ తీసుకొచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాబృందాలు, సంగీత విధ్వంసులను, వివిధ రంగాలకు చెందిన కళాకారులను ఆహ్వానించడం జరిగిందన్నారు. విజయవాడ ఉత్సవాలను నగరవాసులు తమ బంధుమిత్రులను ఆహ్వానించి భాగస్వాములను చేయాలని పిలుపు నిచ్చారు. ఈనెల 28న 3 వేల మంది కళాకారులతో బందర్ రోడ్డులో కార్నివాల్ పేరిట అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుందన్నారు. విజయవాడ ఉత్సవ్ కు శ్రీకారం చుట్టిన ఎంపీ కేశినేని శివనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెంకన్న మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలు చర్చించుకునేలా విజయవాడ ఉత్సవ్ కు స్వీకారం చుట్టి, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఘనత ఎంపీ కేశినేని శివనాథ్ కే దక్కుతుందన్నారు. ఉత్సవంతో నగరం ఖ్యాతి నలు దిశలా వ్యాపించిందని, చక్కని కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. మైసూరు, హౌరా తరహాలో విజయవాడ ఉత్సవానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రజల సహకరించాలని కోరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు నగరవాసులు చక్కని ఆతిథ్యం ఇవ్వాలని, అలాగే అతిధులను గౌరవించాలని కోరారు.
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతదేశంలోని మొదటిసారిగా ఇలాంటి ఉత్సవం విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులతో పాటు నగరవాసులు సద్వినియోగం సూచించారు. విజయవాడ నగర ప్రతిష్ట, గొప్పతనం దేశవ్యాప్తంగా చాటి చెప్పాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఉత్సవ వేదికలపై జరిగే కార్యక్రమాలను ఆస్వాదించాలని కోరారు. .
ఈకార్యక్రమంలో నగరాల సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ తిరుమలేష్, నగరాల కార్పొరేషన్
స్టేట్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, శాప్ డైరెక్టర్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, బొడ్డుపల్లి శ్రీను, సురభి బాలు, కుంచం దుర్గరావు, హజీజ్, జాహీద్, ఈగల సాంబ, ఎ.కొండ, క్లస్టర్ ఇన్చార్జులు ధనేకుల సుబ్బారావు, యేదుపాటి రామయ్య, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, టిడిపి నాయకులు గంగాధర రెడ్డి, సుభానీ, ఉమామహేశ్వరరావులతో పాటు తదితరులు పాల్గొన్నారు.




