Friday, June 26, 2026

వినాయక్ నగర్‌లో కొత్త పీహెచ్‌సీ భవన నిర్మాణానికి భూమి కేటాయింపు

Must read

వినాయక్ నగర్ ప్రజలకు త్వరలోనే ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు అద్దె భవనంలో కొనసాగుతున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) కోసం శాశ్వత భవన నిర్మాణానికి పునాది పడింది.జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సాయి నగర్ సీపీ ఆఫీస్ పక్కన 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఈ నిర్మాణానికి కేటాయించారు. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ (GHMC) ఇప్పటికే రూ.1 కోటి 43 లక్షల నిధులను శాంక్షన్ చేసింది.ఈ స్థలాన్ని వినాయక్ నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, ఏఈ నవీన్ కుమార్, సూపర్వైజర్ వెంకటేష్, రమేష్ లతో కలిసి ఈ రోజు సందర్శించారు. స్థల పరిశీలన అనంతరం త్వరలోనే డిజైన్ ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి, ఆ తరువాత భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు వినాయక్ నగర్ యుపీహెచ్‌సీ ఒక అద్దె భవనంలో కొనసాగుతూ, స్థానిక ప్రజలకు తక్కువ స్థలంలో పరిమిత సేవలు అందిస్తోంది.
కొత్తగా కేటాయించిన ప్రభుత్వ స్థలంలో శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యాక:

అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి,

రోగులు ఎక్కువ సౌకర్యాలతో చికిత్స పొందగలరు,

అద్దె భవన సమస్యలకు ముగింపు పలుకుతుంది.

ఈ ప్రాజెక్టు సాధనలో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కీలకపాత్ర పోషించారు. ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆమె నిరంతరంగా కలెక్టర్, GHMC అధికారులతో సమన్వయం చేస్తూ ముందడుగు వేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!