తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయనీ, ఈ మొత్తాన్ని చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవలను నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులకు లేఖ రాసినా స్పందన రాలేదని పేర్కొన్నారు.చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి తలెత్తిందని, బకాయిలు చెల్లించకపోతే మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్




