Friday, March 6, 2026
spot_imgspot_img

బాలకృష్ణకు గోల్డ్ ఎడిషన్ అవార్డు

Must read

ప్రసిద్ధ నటుడు మరియు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో అరుదైన మైలురాయిని సాధించారు. 50 ఏళ్లుగా భారత చలన చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో స్థానం సంపాదించారు. భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు‌గా బాలకృష్ణ ఘనతను సొంతం చేసుకున్నారు.హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరై, వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ బాలకృష్ణను ప్రశంసించారు. “ఒక చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్నా అది ఒక్క బాలయ్య బాబుతోనే సాధ్యం. ఆయన అందరికీ బాలయ్య అయితే, నాకు మాత్రం ముద్దుల మావయ్య” అని పేర్కొన్నారు. లోకేశ్ 50 ఏళ్లుగా సినిమా, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ సంపాదించిన ప్రత్యేక స్థానాన్ని గుర్తుచేశారు.అలాగే, బాలకృష్ణ ఎప్పుడూ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారని, చారిత్రక, జానపద, ఆధ్యాత్మికం, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్లలో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయాన్ని మంత్రి లోకేశ్ వివరించారు. “బాలయ్య బాబుది భోళాశంకరుడి మనస్తత్వం, అందుకే సినీ పరిశ్రమ ఆయనను అంతగా ప్రేమిస్తుంది. బసవతారకం ఆసుపత్రి ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ అంటూ అద్భుతంగా రాణించారు. ఆయనకు ఈ పురస్కారం రావడం తెలుగు జాతికి గర్వకారణం” అని లోకేశ్ అన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!