Saturday, June 6, 2026
Google search engine

గాలి భాను ప్రకాశ్‌పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం

Must read

నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రూ.2 వేలు ఇస్తే రోజా ఏమైనా చేసేది’’ అనే వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో అనాచారమైనవని ఆమె అన్నారు.‘‘ఒక మహిళా నేతపై ఇలాంటి హద్దులు మీరిన వ్యాఖ్యలు చేయడం గెలిచిన ఎమ్మెల్యేకు మించిన మాటేమిటి? సమాజంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఈ మాటలు చాటుతున్నాయి’’ అని శ్యామల మండిపడ్డారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం మాట్లాడే వారు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.‘‘ఒకటి కాదు… రెండు కాదు… తరచుగా టీడీపీ నేతలు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది క్షమించరాని విషయం. ఇటువంటి మాటలు మాట్లాడిన వారికి శాసనసభలో స్థానం ఉండకూడదు’’ అని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!