Friday, March 6, 2026
spot_imgspot_img

విష్ణుపూరి లో దాదాపు 60 లక్షల రూపాయలతో నాలా పనులు ప్రారంభించిన శ్రవణ్

Must read

విష్ణుపూరి కాలనీలో రూ. 60 లక్షల అదనపు నిధులతో నాలా అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. గతంలో దాదాపు రూ. 1.5 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలా పనులకు ఇది కొనసాగింపుగా జరుగుతోంది. తాజా పనులు పూర్తయిన అనంతరం ఆర్.కే.నగర్ సీసీపీఎల్ నుండి సర్దార్ పటేల్ నగర్ వరకు నాలా నిర్మాణం పూర్తవనుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వినాయక చవితికి ముందుగా ఈ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాం. కాలనీవాసులు అసౌకర్యం ఎదుర్కొనకుండా ముందస్తు ఏర్పాట్లు జరుగుతాయి,” అని తెలిపారు. అదే విధంగా జి.ఎన్.ఆర్ మేఘన వద్ద ప్యాచ్ వర్క్‌ను తక్షణమే పూర్తిచేయాలని కూడా సూచించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈ మహేష్, ఏఈ నవీన్, రమేష్, నాని, శ్రీనివాస్, వెంకటలక్ష్మి, నందు యాదవ్, ఉజ్వల,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!