Homeఆంధ్రప్రదేశ్తీవ్ర తుపానుగా మారిన ‘అక్వాన్’.. ఈ జిల్లాల సరిహద్దుల్లో బీభత్సం.. అతి భారీ వర్ష సూచన,...

తీవ్ర తుపానుగా మారిన ‘అక్వాన్’.. ఈ జిల్లాల సరిహద్దుల్లో బీభత్సం.. అతి భారీ వర్ష సూచన, స్కూళ్లకు సెలవులు!

Cyclone Aquan: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను ‘అక్వాన్’ గడిచిన ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది కళింగపట్నంకు 320 కి.మీ., నరసాపురంకు 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తొలుత నెల్లూరు-తుని మధ్య తీరం దాటుతుందని భావించినప్పటికీ, వాతావరణ మార్పులతో దిశ మార్చుకుని రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కి.మీ., గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాంధ్రకు అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు:

తుపాను(Cyclone Aquan) ఒడిశా వైపు మళ్లినప్పటికీ, ఏపీలోని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

తీర ప్రాంత ప్రజలకు హై అలర్ట్.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన:

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments