Homeతెలంగాణఎక్కువ కాలం బతకడమే కాదు.. ఆరోగ్యంగా బతకాలి.. విజయ్ దేవరకొండ, పీవీ సింధు వెల్‌నెస్ మంత్రం...

ఎక్కువ కాలం బతకడమే కాదు.. ఆరోగ్యంగా బతకాలి.. విజయ్ దేవరకొండ, పీవీ సింధు వెల్‌నెస్ మంత్రం ఇదే!

  • యశోద హాస్పిటల్స్ వెల్బీయింగ్ రౌండ్టేబుల్ చర్చ
  • అనారోగ్యం వచ్చాక కాదు.. ముందే మేల్కొందాం
  • లైఫ్‌లో సక్సెస్‌తో పాటు హెల్త్ కూడా ముఖ్యం..
  • విజయ్ దేవరకొండ, పీవీ సింధు వెల్‌నెస్ సూత్రాలు

క్రమశిక్షణే ఆరోగ్యానికి పునాది : పీవీ సింధు
క్రీడాకారులకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, క్రమశిక్షణ అవసరమని పీవీ సింధు పేర్కొన్నారు. వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతి రోజువారీ జీవితంలో భాగం కావాలని సూచించారు.

శరీరం, మనసు రెండూ బాగుండాలి: దాజీ
ఆరోగ్యం అంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదని, శరీరం, మనసు, భావోద్వేగాల మధ్య సమతుల్యత అవసరమని దాజీ వివరించారు. ధ్యానం, ప్రశాంతమైన ఆలోచనలు జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని చెప్పారు.

యశోద హాస్పిటల్స్ చైర్మన్ జి. రవీందర్ రావు మాట్లాడుతూ.. వ్యాధుల నివారణకు చికిత్సతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని, ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంస్థల పని సంస్కృతిలో భాగం చేయాలని డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గురుకంటి సూచించారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనే సందేశాన్ని ఈ రౌండ్టేబుల్ ఇచ్చింది..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments