Friday, March 6, 2026
spot_imgspot_img

తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం – పోలీసులకు, మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

Must read

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ డీజీపీకి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.

మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వహించిన వేడుకలపై స్పందించిన తీన్మార్ మల్లన్న, ‘‘బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటి?’’ అంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా, ఆమెపై ‘‘కంచం పొత్తా? మంచం పొత్తా?’’ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది.

జాగృతి కార్యకర్తల దాడి – కార్యాలయం ధ్వంసం:
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి దిగారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. తనపై, తన కార్యకర్తలపై హింసకు ప్రేరేపించేలా మల్లన్న ప్రవర్తించారని కవిత ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ రాజకీయ నాయకులను కించపరిచేలా మాట్లాడటం అనుచితమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీన్మార్ మల్లన్న కౌంటర్:
ఇక ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ, ‘‘కవిత అనుచరులు నన్ను హత్య చేసేందుకు యత్నించారు. నా గన్‌మెన్ గాల్లోకి కాల్చడంతోనే నేను ప్రాణాలతో బయటపడ్డాను,’’ అని ఆరోపించారు.

ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల అంశం మధ్యలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. వ్యవహారాన్ని త్వరగా సమాధానం చేయాలంటూ ప్రజలు, పౌర సమాఖ్యలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!