Friday, June 26, 2026

టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

Must read

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ టెస్టులో నాలుగో రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ముందు 193 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.

భారత ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌తో 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను భారీ దెబ్బతీశాడు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీసితే, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ తీశారు.

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 33, హ్యారీ బ్రూక్ 23, జాక్ క్రాలీ 22 పరుగులు చేశారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ సమర్థవంతంగా రాణించలేకపోయారు.

తర్వాత భారత జట్టు 193 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఆరంభంలోనే ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భారత్‌కు షాక్ ఇచ్చాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఖాతా తెరవకుండానే వెనక్కి పంపించాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (5 నాటౌట్), కరుణ్ నాయర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంకా భారత్ విజయానికి 188 పరుగులు అవసరం.

గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో అదే స్కోరు నమోదు చేసి సమానం చేసింది. ప్రస్తుతం మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరి రోజు ఆసక్తికరంగా సాగనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!