Loan EMI Money : రుణం తీరిపోయిందా? ఇక మీ EMI డబ్బుతో వెంటనే ఈ 5 పనులు చేయండి!

Must read

  • రుణం తీరిందా? మీ EMI డబ్బుతో ఇలా చేయండి
  • ఇక EMI భారం లేదు.. భవిష్యత్తు భద్రతకు పొదుపు
  • మీ డబ్బును మరింత పెంచుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్

Loan EMI Money : హోం లోన్ లేదా పర్సనల్ లోన్ పూర్తయిందా? అయితే, నెలనెలా చెల్లించే ఈఎంఐ భారం నుంచి మీకు విముక్తి లభించినట్లే.. చాలామంది లోన్ తీరిపోయిన తర్వాత ఆ డబ్బును షాపింగ్, ప్రయాణాలు, ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తారు.

కానీ, అదే మొత్తాన్ని తెలివిగా పొదుపు చేస్తే మీ భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. రుణం తీరిన తర్వాత మిగిలే ఈఎంఐ డబ్బును ఏ 5 మార్గాల్లో వినియోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి :
అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పులపై ఆధారపడకుండా ఉండేందుకు అత్యవసర నిధి అవసరం. మీ కుటుంబానికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టండి. ఆదాయం అస్థిరంగా ఉన్నవారు లేదా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారు 9 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా ఫండ్ ఏర్పాటు చేసుకోవడం బెటర్..

2. ఆరోగ్య, జీవిత బీమా తీసుకోండి :
ఉద్యోగంతో పాటు వచ్చే ఆరోగ్య బీమాపైనే ఆధారపడకండి. మీ కుటుంబ అవసరాలకు తగిన ఆరోగ్య బీమాను తీసుకోండి. కుటుంబం మీ ఆదాయంపై ఆధారపడితే ఆర్థిక రక్షణ కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోండి.

Read Also : Samsung Galaxy F70 5G : రూ. 17,999కే కొత్త శాంసంగ్ 5G ఫోన్.. 5,000mAh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!

3. రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టండి :
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ అవసరం. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి SIP, EPF, PPF, NPS వంటి మార్గాలను ఎంచుకోండి. లాంగ్ టైమ్ పెట్టుబడులు భవిష్యత్తు అవసరాలకు వాడుకోవచ్చు.

4. ఇతర లోన్లను ముందుగానే తీర్చండి :
క్రెడిట్ కార్డు బకాయిలు లేదా అధిక వడ్డీతో ఉన్న ఇతర రుణాలు ఉంటే ఈఎంఐ మొత్తాన్ని వాటి పేమెంట్లకు మళ్లించండి. తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. ముందస్తు పేమెంట్లపై ఏవైనా ఛార్జీలు ఉన్నాయో తెలుసుకోండి.

5. భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు :
పిల్లల ఉన్నత విద్య, ఇంటి నిర్మాణం, రెన్యువల్ లేదా ఇతర ముఖ్యమైన పనుల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసుకోండి. లక్ష్యానికి ఎంత మొత్తం అవసరం? ఎప్పటికి అవసరం అనే అంశాలను బట్టి పొదుపు లేదా పెట్టుబడి ఎంచుకోండి.

రుణం తీరిన తర్వాత ఈఎంఐ ఆగిపోవచ్చు.. కానీ, మీ ఆర్థిక లక్ష్యాలు ఆగకూడదు.. ఆ మొత్తాన్ని ఖర్చు చేయకుండా ప్లానింగ్ ప్రకారం వినియోగిస్తే, భవిష్యత్తుకు మరింత బలమైన ఆర్థిక పునాది వేసుకోవచ్చు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!