Teja Sajja Wedding : టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ యంగ్ హీరో త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్లో వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్..? టీవీకే నేత కీలక కామెంట్స్..
తేజ సజ్జా వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నవంబర్‌లో ఆయన నిశ్చితార్థం జరగనుందని, డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వివాహ వేడుక నిర్వహించనున్నారని ప్రచారం సాగుతోంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తేజ సజ్జా వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఆయనకు కాబోయే జీవిత భాగస్వామి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఈ విషయాలపై హీరో తేజ సజ్జా, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ యంగ్ హీరో పెండ్లి శుభవార్తను అభిమానులతో పంచుకోనున్నారట.
ప్రస్తుతం తేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ 2కి సంబంధించిన ఓ షెడ్యూల్ ను పూర్తిచేసిన ఆయన.. తాజాగా జాంబిరెడ్డి2ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబిరెడ్డికి కొనసాగింపుగా రానున్న చిత్రమిది. వరుస సినిమాలతో అలరిస్తూనే మరోవైపు రియాలిటీ షోతో వ్యాఖ్యాతగా ఓటీటీలోనూ తేజ సజ్ఞా అడుగుపెట్టారు.


