ఇప్పుడు సత్య కమెడియన్ గా, కామెడీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు సినిమాలో కామెడీ కావాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే. ఇప్పుడు ఏ సినిమాలో అయినా సత్య ఉండాల్సిందే. అంతలా సత్య బిజీ అయ్యాడు. తన హావభావాలతో, డైలాగ్ డెలివరీతో ఫుల్ గా నవ్విస్తాడు సత్య. ఇటీవల ఆదర్శ కుటుంబం సినిమాలో కూడా సత్య పాత్రనే హైలెట్ అయింది. ఇంత బిజీగా ఉన్న సత్య రోజుకు దాదాపు రెండున్నర లక్షల వరకు తీసుకుంటున్నారట. పాత్ర పెద్దది, పెద్ద సినిమా అయితే మూడు లక్షల వరకు కూడా తీసుకుంటున్నారట. స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న సత్య వరుస సినిమాలు చేస్తూ ఇలా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
వామ్మో.. సత్య ఒక్క రోజుకు రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు తీసుకుంటాడో తెలుసా?


