‘ది సెస్సో’.. ఈ బోల్డ్ ట్రైలర్ చూశారా..? త్వరలో సినిమా రిలీజ్..

Must read

The Sesso Trailer : యశ్ రాజ్, మౌపియ గౌస్వామి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ది సెస్సో’. గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్ పై బి.ఎన్.రవి నిర్మాణంలో యశ్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ హీరో ఆకాష్ జగన్నాథ్ గెస్ట్ గా విడుదల చేసారు.

ప్రేమలో నమ్మకద్రోహం, అవమానాలతో తనపై తనకు నమ్మకం కోల్పోయిన ఐటి ఉద్యోగి కార్తీక్ (యష్ రాజ్), మరోవైపు సమాజం వేసే నిందలు, వేధింపుల వల్ల ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్న షమ్రిన్ (మౌపియా గోస్వామి) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరి మధ్య ఏర్పడే ప్రేమ, బంధం చుట్టూ భావోద్వేగాలతో ఈ కథ ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, ట్రైలర్ రిలీజ్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article