ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని 43వ డివిజన్ నూతన కార్పొరేటర్ ఎస్.ఏ.టి. రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజేష్ ఎంపీని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి తన గౌరవాభిమానాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.43వ డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో నూతన కార్పొరేటర్ రాజేష్ ముందుకు సాగుతున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కలిసిన సందర్భంగా కార్పొరేటర్ ఎస్.ఏ.టి. రాజేష్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.




