న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డేలో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 4 ప‌రుగుల తేడాతో గెలిచిన భార‌త్..

Must read

IND vs NZ : న్యూజిలాండ్‌తో వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 4 పరుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు భార‌త్ బ‌రిలోకి దిగింది. 26 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. ఎంత సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌లేదు. భార‌త్ 20 ఓవ‌ర్లు ఆడ‌డంతో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని ఉప‌యోగించారు. 26 ఓవ‌ర్ల‌కు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో భార‌త్‌ 109 ప‌రుగులుగా చేయాల్సి ఉండ‌గా.. టీమ్ఇండియా 4 ప‌రుగులు ఎక్కువ‌గానే చేసింది. దీంతో భార‌త్ విజేత‌గా నిలిచింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (30; 46 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్ శ‌ర్మ (23; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (26 నాటౌట్; 38 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ డ‌కౌట్ కాగా.. విరాట్ కోహ్లీ, అక్ష‌ర్ ప‌టేల్‌లు చెరో 7 ప‌రుగులు చేశారు. న‌మ‌న్ ధీర్ (12 16 బంతుల్లో 2 ఫోర్లు) విఫ‌లం అయ్యాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జేమీస‌న్, జాక‌బ్ డ‌ఫీ చెరో మూడు వికెట్లు తీశారు. మాథ్యూ ఫిషర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు.. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 47 ఓవ‌ర్ల‌కు కుదించ‌గా.. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 41 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (55; 104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ (31; 38 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించాడు. మిగిలిన వారిలో హెన్రీ నికోల‌స్ (11) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు సాధించాడు. విల్ యంగ్ (6), టిమ్ సీఫెర్ట్ (0), టామ్ లాథ‌మ్ (7), గ్లెన్ ఫిలిప్స్ (0), నాథ‌న్ స్మిత్ (3) లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో గుర్నూర్ బ్రార్ నాలుగు, అకిల్ న‌బీ, అక్ష‌ర్ ప‌టేల్, అన్షుల్ కాంబోబ్ త‌లా రెండు వికెట్లు తీశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!