వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని సఫిల్‌గూడ లేక్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (BGUS) జనరల్ సెక్రటరీగా డా. రావినూతల శశిధర్ పాల్గొన్నారు.కార్యక్రమానికి మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. సఫిల్‌గూడ లేక్ పరిసర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని సందడి నెలకొంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొనగా, నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యకర్తలు, స్థానికులు, భక్తులు పాల్గొని నిమజ్జన వేడుకలను విజయవంతం చేశారు.
సఫిల్‌గూడలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవ సంబరాలు


