Saturday, June 6, 2026
Google search engine

రేవంత్​ రెడ్డికి దేవుడంటే భయం లేదు, భక్తీ లేదు :హరీష్​ రావు

Must read

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడారు.

ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బడులు మాత్రమే కాకుండా గుడులు కూడా కూల్చివేతకు గురవుతున్నాయని ఆరోపించారు. కాకతీయుల కాలానికి చెందిన చారిత్రాత్మక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ “మన ఊరు-మన బడి” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందని విమర్శించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆరోపించారు.

చారిత్రాత్మక దేవాలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్ రావు అన్నారు. అభివృద్ధి పేరుతో పురాతన ఆలయాలను కూల్చివేయడం సరైన పద్ధతి కాదన్నారు. కాకతీయుల వారసత్వం తెలంగాణ గర్వకారణమని, అలాంటి కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని అమలు చేయకుండా మాట తప్పారని హరీశ్ రావు విమర్శించారు. దేవుడంటే భయం, భక్తి ఉంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతున్నాయన్నారు. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదని హరీష్​ రావు అన్నారు.

యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్​ చేశారు. అవి నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలని ఆయన డిమాండ్​ చేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!