Friday, June 26, 2026

వట్టిచెరుకూరులో తేజు ఫిలిమ్స్ సినిమా షూటింగ్

Must read

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి సంబంధించిన రెండవ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. చిత్ర నిర్మాత సంతోష్ రావు బల్గూరి ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయ ప్రాంగణంలో క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా దర్శకుడు సుధాకర రెడ్డి మాట్లాడుతూ, వట్టిచెరుకూరు గ్రామంలో షూటింగ్‌కు అవసరమైన చెరువు, రచ్చబండ, శివాలయం, రామాలయం, పంటపొలాలు, కళ్లాలు వంటి సహజ వాతావరణం ఒకేచోట లభించడం చిత్రీకరణకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. రైతుల జీవన విధానం, వ్యవసాయం నేపథ్యంగా సాగే కథకు ఈ గ్రామం పూర్తిగా సరిపోయిందని తెలిపారు. గ్రామ పెద్దలు అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇంకా అమరావతి, తాళాయపాలెం శైవక్షేత్రం మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో తదుపరి షూటింగ్ జరగనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎన్.ఎస్. నాయుడు, అరుణ, పావులూరి హరినాధ్ బాబు నటిస్తుండగా, రవీంద్రనాథ్, అప్పారావు, వెంకటేశ్వర్లు, కల్లూరి ఆచారి, దాడి శంకర్ రావు, సత్య ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్, మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.చిత్రానికి జగపతి శ్రీనివాస్ కథా రచన అందించగా, ఎస్.ఏ.టి. శ్రీధర్ పీఆర్‌వోగా వ్యవహరిస్తున్నారు. దాసరి రవికుమార్ కెమెరామెన్ మరియు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సహ నిర్మాతగా రాజశేఖర్ రెడ్డి.డి వ్యవహరిస్తుండగా, నిర్మాత సంతోష్ రావు బల్గూరి, కథా మరియు దర్శకత్వ బాధ్యతలను సుధాకర రెడ్డి.టి నిర్వహిస్తున్నారు. త్వరలో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!