Friday, June 26, 2026

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రామచందర్ రావు

Must read

దేశ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు, అలాగే పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో అనూహ్యంగా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

తమిళనాడులో 84.80 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 91.91 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. ఈ స్థాయి ఓటింగ్ సాధారణంగా అరుదుగా కనిపించడంతో, ప్రస్తుత అధికార పార్టీల్లో కొంత ఆందోళన నెలకొంది. అధిక ఓటింగ్ శాతం ప్రభుత్వాలకు అనుకూలంగా మారుతుందా? లేక ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా వ్యతిరేకంగా మారుతుందా? అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. భారీ స్థాయిలో పోలింగ్ జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.

ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం ప్రజలు ప్రస్తుత వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నారనే సంకేతంగా భావించవచ్చని అన్నారు. సాధారణంగా అధిక ఓటింగ్ శాతం మార్పుకు దారితీసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఓట్లు ప్రభుత్వాల మార్పు కోసమే పడి ఉండవచ్చని కూడా సూచించారు.

అధిక ఓటింగ్ అనేది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేసి ఉండవచ్చు. లేదా ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా అధికంగా ఓటింగ్ జరిగి ఉండవచ్చన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. అక్కడి రాజకీయ పరిస్థితులు, పోటీ తీవ్రత కారణంగా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉండవచ్చరన్నారు. అలాగే తమిళనాడులో కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!