Friday, June 26, 2026

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

Must read

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు.తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీ వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, ఈ నోటీసులు పంపారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ సేవలను డిజిటల్ రూపంలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫోన్ల కొనుగోలు ప్రక్రియపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం పలు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టింది.

బీఆర్‌ఎస్ శ్రేణుల ఆరోపణల ప్రకారం, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే అధిక ధరకు కొనుగోలు చేసి మంత్రి కమీషన్లు తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఈ ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కావాలనే చేస్తున్న దుష్ప్రచారమని ఆమె మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో, పార్టీ అధినేతగా కేసీఆర్ ఈ ప్రచారానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆయనపై నేరుగా లీగల్ నోటీసులు పంపిస్తూ, తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదే సమయంలో ఫోన్ల కొనుగోలు విషయంలో పూర్తి పారదర్శకత పాటించామని మంత్రి వెల్లడించారు. ఒక్కో ఫోన్‌ను కేవలం రూ. 11,650కే కొనుగోలు చేశామని, ఇది మార్కెట్ ధరకు అనుగుణంగానే ఉందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి టెండర్ ప్రక్రియ ద్వారా ఈ కొనుగోలు జరిగినట్లు వివరించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగించే విషయమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వివాదం రాజకీయ రంగంలో మరింత వేడెక్కే అవకాశముంది. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ లీగల్ నోటీసులు కొత్త చర్చకు దారి తీసాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!